గోడౌన్ లో అగ్ని ప్రమాదం..రూ.5 కోట్ల ఆస్తి నష్టం

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బందర్‌ రోడ్డులోని ఓ మెడికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  అయితే దాదాపు 5 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.