రాఘవాపూర్  వద్ద రైలు ఇంజన్ లో మంటలు

రాఘవాపూర్  వద్ద రైలు ఇంజన్ లో మంటలు

పెద్దపల్లి జిల్లా : మైసూర్ నుంచి దర్భంగా వెళ్తున్న బాగ్ మతీ సూపర్ ఫాస్ట్  ఇంజన్ లో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి, రామగుండం మధ్యనున్న రాఘవాపూర్  వద్ద ఈ  ఘటన చోటుచేసుకుంది. దీంతో ట్రైన్ ను పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు  అధికారులు తరలించారు.  రైల్వేస్టేషన్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. రైలును 40 నిమిషాల పాటు పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.  

రైలు ఇంజన్ లో మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. చివరకు మంటలను ఆర్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంజన్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.