బోరబండలోని బైక్ మెకానిక్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సైట్3 లేబర్అడ్డాలో మహ్మద్ లతిక్ బైక్ మెకానిక్ షెడ్ నడుపుతుంటాడు. ఈ క్రమంలో గురువారం అకస్మాత్తుగా షెడ్లో మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సర్వీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు.