
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరులోని మల్లికార్జున కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి, మిల్లులోని పత్తి కాలిపోయింది. కాటన్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడి నిల్వ చేసిన పత్తిపై పడ్డాయి. దీంతో పత్తి అంటుకొని కాలిపోయింది. వెంటనే నిర్వాహకులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా, ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పాయి. సుమారు 300 క్వింటాళ్ల పత్తి కాలిపోయిందని, రూ. 30 లక్షల వరకు నష్టం జరిగిందని మిల్లు ఓనర్ తెలిపారు.