నాగోల్ ఫతుళ్లాగూడలోని ఫారెస్ట్ ఏరియాలో మంటలు

నాగోల్ ఫతుళ్లాగూడలోని ఫారెస్ట్ ఏరియాలో మంటలు

 మేడ్చల్ జిల్లా  నాగోల్ ఫతుళ్లాగూడ ఫారెస్ట్ ఏరియాలో మంటలు చెలరేగాయి.  ముక్తీ ఘాట్ సమీపంలోని మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్ లో ఒక్కసారిగా  మంటలు వచ్చాయి.  ఫారెస్ట్ లోపలికి మంటలు వ్యాపించాయి. 

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పుతున్నారు.  గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి ఉంటారని అనుమానిస్తున్నారు.  మంటల ధాటికి జంతువులు చనిపోతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

ALSO READ | పాన్ షాప్లో దర్జాగా గంజాయి చాక్లెట్ల అమ్మకం.. 85 ప్యాకెట్లు స్వాధీనం