నాచారం ఆరిజన్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. స్క్రాప్​ లో చెలరేగిన మంటలు

నాచారం ఆరిజన్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. స్క్రాప్​ లో చెలరేగిన మంటలు

నాచారం.. మల్లపూర్​ పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీ ఆవరణలో అగ్నిప్రమాదం జరిగింది.  ఆరిజన్​ పరిశ్రమకు చెందిన స్క్రాప్ ​ తగలబడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద తీవ్రతకు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.   సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.