పూజ గదిలో మంటలు.. ఇల్లు దగ్ధం

పూజ గదిలో మంటలు.. ఇల్లు దగ్ధం

బషీర్ బాగ్: దీపావళి నాడు పూజ గదిలో చెలరేగిన మంటలతో నారాయణగూడ పరిధిలోని ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. చంద్రశేఖర్​అనే అడ్వకేట్​హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 18లోని కీర్తి శిఖర అపార్ట్​మెంట్ నాలుగో అంతస్తులో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో పూజ చేశాడు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి బర్కత్ పురాలోని తన ఆఫీసులో పూజ చేసేందుకు వెళ్లాడు. ఆ టైంలో బాల్కనీ డోర్ తెరిచి పెట్టి వెళ్లాడు. అయితే రాత్రి10.30 గంటలప్పుడు చంద్రశేఖర్​ఫ్లాట్ నుంచి మంటలు ఎగిసిపడటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు, ఫైర్, డీఆర్ఎఫ్​సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్​సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్క ఫ్లాట్‎లకు మంటలు వ్యాపించకుండా చూశారు. అయితే అప్పటికే చంద్రశేఖర్​ఫ్లాట్‎లోని ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. అధికారులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లు అపార్ట్​మెంట్ వాసులు తెలిపారు. పూజ గదిలో చెలరేగిన మంటలతో ఇల్లు దగ్ధమైందని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణగూడ ఎస్సై షేక్ షఫీ తెలిపారు.