ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లలో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లోని హైదర్ గూడ ఎర్రబోడ వద్ద ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
హైదర్ గూడలోని ఆడమ్ ఎలక్ట్రికల్ బైక్ షోరూం సడెన్ గా మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ALSO READ | ఘట్ కేసర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా
బ్యాటరీ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలక్ట్రిక్ బైకులు పూర్తిగా తగలబడి పోయాయి.
ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లలో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ మధ్య బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చంగిచర్ల రామకృష్ణ నగర్లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో బైక్ లు బూడిదై పోయాయి.