ఆర్టీసీ బస్సులో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..

ఆర్టీసీ బస్సులో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..

ముదిగొండ ప్రధాన సెంటర్లో కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో భయబ్రాంతులైన  ప్రయాణికులు అరుపులతో పరుగు పెట్టారు. కోదాడ డిపోకు చెందిన ఏపీ 29జడ్ 2998 ఆర్టీసీ బస్సు  ఖమ్మం నుండి కోదాడ వెళుతుండగా ముదిగొండ ప్రధాన సెంటర్‌ రాగానే ఒక్క సారిగా ఇంజన్ నుంచి పోగలు వచ్చాయి. చూస్తుండగానే బస్సు మొత్తం  పోగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు అరుపులు, కేకలతో బస్సులో నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందికి దిగారు.

బస్సులో స్థాయి ని మించి ప్రయాణికులు  ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బస్సు కండిషన్ లేకపోవడంతో రేడియేటర్ బాయిల్డ్ అయి కవ్వటంతో ఒక్క సారిగా బస్సులో మొత్తం పోగలు కమ్ముకున్నాయని ప్రయాణికులు తెలిపారు. అప్రమత్తం అయన డ్రైవర్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదని  తెలపడంతో ప్రయాణికులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.కోదాడ ఖమ్మం రూట్ లో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పటికి  వారికి సరిపడా బస్సులు లేవని.., అందుకే ప్రయాణికులు బస్సులలో కెపాసిటికి మించి ఎక్కడంతో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.