ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ లో 2023 డిసెంబర్ 2 శనివారం ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు భయంతో కేకలు వేస్తూ.. బయటకు పరుగులు తీశారు.
ఆసుపత్రి సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.