
సుజాతనగర్, వెలుగు : మండలంలోని వేపలగడ్డ లో చింతలపుడి రోసిరెడ్డి కి చెందిన మక్క తోటలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రోసి రెడ్డికి మూడెకరాల కౌలు చేను ఉంది. ఈ తోట మధ్య నుంచి కరెంట్ లైన్లు వెళ్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం రావడంతో పక్కనే ఉన్న వేప చెట్టు కొమ్మలు విద్యుత్ వైర్ల కు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో 3 ఎకరాల తోట, 4 మోటార్ పైపులు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసినా రాలేదు. చేతికందిన పంట కళ్ళ ముందే కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ నర్మద, అర్ఐ కాంతారావు లు తోటను పరిశీలించి రూ. లక్షా యాభై వేలు నష్టం జరిగినట్లు తెలిపారు.