శాతవాహన వర్సిటీలో అగ్నిప్రమాదం..కాలిపోయిన పాత ఆన్సర్‌‌‌‌ షీట్లు

శాతవాహన వర్సిటీలో అగ్నిప్రమాదం..కాలిపోయిన పాత ఆన్సర్‌‌‌‌ షీట్లు

కరీంనగర్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : కరీంనగర్‌‌‌‌లోని శాతవాహన యూనివర్సిటీలో అగ్నిప్రమాదం జరిగింది. వర్సిటీ ఆవరణలోని చెట్ల మధ్య గురువారం మంటలు చెలరేగగా ఫైర్‌‌‌‌ సిబ్బంది ఆర్పివేశారు. అయితే శుక్రవారం మరోసారి మంటలు లేచి క్రమంగా పాత ఆన్సర్‌‌‌‌ షీట్లు భద్రపరిచే గోదాం వరకు విస్తరించాయి. దీంతో షెడ్‌‌‌‌లో ఉన్న పాత ఆన్సర్‌‌‌‌ షీట్లు కాలిపోయాయి.

 విషయం తెలుసుకున్న ఫైర్‌‌‌‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ఘటనపై వీసీ ఉమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో రెండేండ్ల కిందటి ఆన్సర్‌‌‌‌ షీట్లు మాత్రమే దగ్ధమయ్యాయని, రెగ్యులర్‌‌‌‌ పేపర్లకు ఎలాంటి నష్టం కలగలేదన్నారు. డేటా మొత్తం కంప్యూటర్లలో భద్రంగా ఉందని, విద్యార్థులు ఆందోళన చెందొద్దని సూచించారు. 2021–22 ఏడాదికి సంబంధించిన ఆన్సర్‌‌‌‌ పేపర్లను టెండర్ ద్వారా అమ్మేందుకు అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ నుంచి రేకుల షెడ్‌‌‌‌కు తరలించామన్నారు.