శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర అగ్ని ప్రమాదం..

శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో మంటలు ఎగసిపడ్డాయి.  మూడో అంతస్తు పైకి  మంటలు వ్యాపించాయి. అదే భవనంలో పనిచేస్తున్న 150 మంది కార్మికులు ఒక్కసారిగా  బయటకు పరుగులు తీశారు. 

Also Read :- తెలంగాణలో సైబర్ టెర్రర్! ..2024లో రూ.1866 కోట్లు స్వాహా

 సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం  చేస్తున్నారు.   దాదాపు గంటకు పైగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.   ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.