మేడ్చల్ జిల్లా బాలానగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దాసరి సంజీవయ్య కాలనీలోని ఓ ఇంట్లో ఫిబ్రవరి 2న తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న జలగం సాయి సత్య శ్రీనివాస్(32 కాలిన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు.
ఏపీ రాజమండ్రికి చెందిన సత్య శ్రీనివాస్, పటాన్ చెరు రుద్రారంలోని ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేదా ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు అగ్నికి ఆహుతయ్యాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు...