హైదరాబాద్ బేగంపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. లైఫ్ స్టైల్ బిల్డింగులోని ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగులోని ఆరోరా బ్యాంకెట్స్ హోటల్ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన ఉన్న ఆయిల్ కు మంటలు అంటుకొని చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది , కస్టమర్స్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
బిల్డింగ్ లోని అన్ని దుకాణాలలో ఫైర్ సేఫ్టీ అల్లారం మోగడంతో భయాందోళనలకు గురైన దుకాణదారులు అన్ని షెటర్స్ మూసేసి బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. సంఘటన స్థలానికి వచ్చిన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.