పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడ్డ బట్టల షాపులు

పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడ్డ బట్టల షాపులు

హైదరాబాద్ పాతబస్తీ దివాన్‌దేవిడిలోనీ అబ్బాస్ టవర్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 10న తెల్లవారుజామున నుంచి  మంటలు చెలరేగాయి.  బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఉన్న 40కి పైగా బట్టల షాపుల్లో మంటలు చెలరేగాయి. ఏ క్షణంలోనైనా భవనం స్లాబ్ కూలే అవకాశం ఉంది.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 దాదాపు 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు.  షాపులు వరుసగా ఉండటంతో మంటలు వ్యాపించాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని వ్యాపారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.