హైదరాబాద్ కూకటల్ పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ గ్రౌండ్ సమీపంలో టీ టైం షాప్ లో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టీ షాపు మొత్తం దగ్ధమైంది.
వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు పైర్ సిబ్బంది. పూర్తిగా షాపు దగ్ధం కావడంతో ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.