హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్ పిల్లర్ నెంబర్ 1724 దగ్గర ఉన్న హుక్కా సేంటర్ లో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ పై అంతస్తులో ఉన్న హుక్కా సెంటర్ లో ఒక్కసారిగా మంటలు రేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. జనవరి 31న ఉదయం అగ్ని ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మాదాపూర్ పోలీసులు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో హుక్కా సేంటర్ లోని ఫర్నిచర్ సామాగ్రి కాలిపోయింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.