నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లిలోని  హజ్ హౌస్ లో  భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉర్దూ అకాడమీ కార్యాలయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు  వ్యాపించాయి. సిబ్బంది  కార్యాలయానికి  తాళాలు వేసి వెళ్లి పోవడంతో ప్రాణాపాయం తప్పింది. విలువైన డాక్యుమెంట్లు కాలిపోయినట్లు తెలుస్తోంది.

హజ్ హౌస్ సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.