పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న RR పూజా సామగ్రి సెంటర్, సూర్య మొబైల్ షాప్ , వాచ్ సెంటర్ , ఫోటో గూడ్స్ సెంటర్ లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.