హైదరాబాద్ ఉప్పల్ లోని శ్రీ భాగ్య రెస్టారెంట్ అండ్ బార్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
హోటల్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | హైదరాబాద్లో మహిళా కానిస్టేబుల్ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు