
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. 2024, జూన్ 20వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ ఫామ్ మీదకి వస్తున్న అదనపు ఏసి భోగిలో షాట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా కమ్ముకున్నాయి.
రైలు బోగీల్లో మంటలను గమనించిన సిబ్బంది.. ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. ఈలోపు రైల్వే స్టేషన్ లోని మంటలు ఆర్పే యంత్రాలను ప్రయత్నాలు చేశారు. రైలు బోగీలోని మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రైల్వే సిబ్బంది. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ట్రైన్ బోగీల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.