![వికారాబాద్ జిల్లా తాండూరులో అగ్నిప్రమాదం..వామ్మో పక్కనే స్కూల్](https://static.v6velugu.com/uploads/2025/02/fire-incident-in--vikarabad-district-tandoor_OvJGwoWXBz.jpg)
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సోపాలు, రెగ్జిన్ కుర్చీలు తయారు చేసే దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. పక్కనే పాఠశాల ఉండటంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. భయంతో విద్యార్థుల అరుపులు కేకలు వేశారు. దీంతో స్కూలు సిబ్బంది విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్లారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సోఫాల షాపు జనావాసాల మధ్య ఉంది. మరో వైపు ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండానే పాఠశాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Raed : శివరాత్రి ముందే సమ్మర్ మొదలైంది.. హైదరాబాదీలు బీ అలర్ట్
హైదరాబాద్ లో ఈ మధ్య రోజుకో అగ్ని ప్రమాదం భయాందోళనకు గురిచేస్తోంది. తరచూ ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది.