లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు గుడిసెలు కాలి బూడిదయ్యాయి. బకెట్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు స్థానికులు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే గుడిసెలు పూర్తిగా దగ్దమయ్యాయి.
ఈ ప్రమాదంలో గుడిసెల్లోని వస్తువులు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. నిరుపేదలు చాలా కాలంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎలాజరిగిందనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు.
హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఫిబ్రవరి 4న చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోట్లాది నష్టం జరిగింది.