![పరుపుల కంపెనీలో అగ్ని ప్రమాదం](https://static.v6velugu.com/uploads/2024/02/fire-incident-took-place-in-mylardev-palli-of-rangareddy-district-in-telangana_FM9bc38rmH.jpg)
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. పరుపుల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక అంచనా కు వచ్చారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.