KPHB కాలనీ డీమార్ట్ సమీపంలో అగ్ని ప్రమాదం

 హైదరాబాద్: కేపీహెచ్‎బీ కాలనీ డీమార్ట్ సమీపంలోని MIG 9/2 అపార్ట్మెంట్లో బుధవారం (నవంబర్ 13) రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.   అపార్ట్మెంట్‎లో పూజలో భాగంగా దీపాన్ని వెలిగించగా ప్రమాదవశాత్తు అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. 

ALSO READ | 19 మందికి అసలు భూమే లేదు.. లగచర్ల ఘటనపై ఐజీ సత్యనారాయణ కీలక ప్రకటన

కూకట్ పల్లి ఫైర్ ఆఫీసర్ జగన్మోహన్ నేతృత్వంలో లచ్చిరెడ్డి, వంశీకృష్ణతో పాటు సిబ్బందితో కలిసి అపార్ట్మెంట్‎లో ఉన్న 15 మంది సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అపార్ట్మెంట్ వాసులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి 15 మందిని రెస్య్కూ చేసిన ఫైర్ సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.