అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన అవసరం : భగవంత్ రెడ్డి

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన అవసరం : భగవంత్ రెడ్డి

జైపూర్, వెలుగు: జిల్లాలోని అడవులు, ప్లాంటేషన్లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ భగవాన్ రెడ్డి అన్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం జైపూర్ అటవీప్రాంతంలోని వాచ్ టవర్ వద్ద అటవీశాఖ, అగ్నిమాపక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన భగవాన్​ రెడ్డి మంచిర్యాల, చెన్నూర్ డివిజన్ల అటవీ అధికారి కె.సర్వేశ్వర్​తో కలసి మాట్లాడారు. 

ఇప్పటినుంచి వేసవి ముగిసే వరకు అడవులు కాలకుండా నివారణ చర్యలు తీసుకుంటూ, అంకిత భావంతో పనిచేయాలని అటవీ అధికారులు, ఉద్యోగులకు సూచించారు. రేంజ్ అధికారులు రత్నాకర్ రావు, శివకుమార్, సదానందం, అప్పలకొండ, కె.అనిత,సుభాశ్, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్ కుమార్, ఫైర్ స్టేషన్ అధికారి రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.