వనపర్తిలోని పీర్లగుట్టపై మంటలు

వనపర్తిలోని పీర్లగుట్టపై మంటలు
  • మంటలు అర్పడంతో తప్పిన పెను ప్రమాదం   

వనపర్తి, వెలుగుః  వనపర్తి పట్టణంలోని చందాపూర్​ రోడ్డులో పీర్ల గుట్టపై చెలరేగిన మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది.  పీర్లగుట్టపై డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల సమీపంలో చెట్లు ఉన్నాయి.  వేసవి కావడంతో ఎండిపోయి ఆకులు రాలాయి.  శనివారం రాత్రి పొద్దుపోయాక గుట్టమీద పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు కనిపించాయి.

 సాగర్​ స్నేక్​ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్​ తన బృందంతో కలిసి గుట్టవద్దకు వెళ్లి చూడగా మంటలు వ్యాపించడాన్ని గమనించి ఆర్పారు.  గుర్తు తెలియని వ్యక్తులు బీడీ లేదా సిగరెట్​తాగి పడేయడం వల్ల ఎండిన  ఆకులు అంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. సకాలంలో స్పందించిన సాగర్​ స్నేక్​ సొసైటీ బృందాన్ని స్థానికులు అభినందించారు.