భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. భంగిమఠం పరమేశ్వర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై అగ్నిగుండంలో నడిచారు.
అనంతరం జాతరలో వివిధ రకాల సేవలు అందించిన పోలీసులు, శానిటేషన్ వర్కర్లను ఆలయ సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో ఈవో కిషన్‌రావు, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు రాజ్‌కుమార్, సాయిబాబు పాల్గొన్నారు.