మియాపూర్ మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం

మియాపూర్ మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో శనివారం సాయంత్రం రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరిగ్గా మియాపూర్ మెట్రో స్టేషన్ కిందకు రాగానే కారులో అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కిందనే ఉన్న మెట్ల పక్కకు కారు ఆపేశాడు. మంటల్లో చిక్కుకున్న కారులో నుంచి డ్రైవర్ బయటకు వచ్చాడు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా దగ్ధమైపోయింది. వోక్స్ వ్యాగన్ కారు పటాన్ చెరువు నుంచి కూకట్పల్లి వెళ్తొంది. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా శబ్దంతో కార్ ఇంజన్ లో మంటలు వచ్చాయి. అగ్నిమాప సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. కారులో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. 

ALSO READ : దారుణం.. ట్రీట్‌మెంట్ కోసం వచ్చి డాక్టర్‪ను కాల్చి చంపారు

ముంబై, హైదరాబాద్ హైవేపై అగ్నిప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు కిలో మీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం ఆఫీసులు, విద్యాసంస్థలు క్లోస్ అయ్యే టైం కావడంతో ప్రయాణీకులు ట్రాఫిక్ తో చాలా ఇబ్బంది పడ్డారు. అటు శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలోనే చిరుత సంచారం అని వార్త కలవరం రేపింది. తర్వాత అది అడవి పిల్లి అని అధికారులు తేచ్చారు.