అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి :ఆఫీసర్ డి.శ్రీనివాస్

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి :ఆఫీసర్ డి.శ్రీనివాస్

జన్నారం, వెలుగు: అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండటమే పరిష్కారమని జన్నారం అగ్నిమాపక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి.శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎండలు తీవ్రంగా ఉన్నందున అగ్ని ప్రమాదాలు జరిగే ఆవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వారం రోజుల పాటు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు పలు పద్దతుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, కాంగ్రెస్​నేత రాజశేఖర్, అగ్ని మాపక సిబ్బంది పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం

బెల్లంపల్లి, వెలుగు: అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్లను ఆదివారం బెల్లంపల్లి ఫైర్‌ స్టేషన్‌ ఎదుట విడుదల చేశారు. పాల్గొన్న బెల్లంపల్లి ఇన్‌చార్జ్‌ ఫైర్ ఆఫీసర్‌ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్‌, సివిల్ డిఫెన్స్ శాఖల ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు.

మాక్ డ్రిల్స్, అవేర్​నెస్ ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూరం సంగీత, కాంగ్రెస్ నేత సూరం బానేశ్, ఫైర్‌ సిబ్బంది రవికుమార్, ప్రభాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.