![తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా నుంచి పొగలు](https://static.v6velugu.com/uploads/2023/11/firecrackers_JrEAKpui2R.jpg)
విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్లే తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో బాణసంచా అంటుకొని పొగలు రావడం కలకలం రేపింది. 2023 నవంబర్ 06 వ తేదీన విశాఖపట్నం నుంచి బయలదేరిన ట్రైన్ సాయత్రం 4 గంటలకు తుని స్టేషన్‌లో ఆగింది. తిరిగి ట్రైన్ బయలుదేరుతున్న టైమ్ లో ఎస్ 3 బోగీలోని టాయిలెట్ల దగ్గర ఉన్న బాణసంచా నుంచి పొగలు వచ్చాయి.
దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే చైను లాగి ట్రైన్ ను ఆపారు. ఆ తరువాత వెంటనే బాణసంచా పేలకుండా ప్రయాణికులు కాళ్లతో తొక్కి ఆ సంచీని బయటకు తోసేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది బోగీని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రైలు బయల్దేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు.