వందే భారత్​లో మంటలు.. 37 మందికి తప్పిన ప్రమాదం

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ రైలులో మంటలు చెలరేగాయి. రాణికమలాపతి–హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్ సోమవారం ఉదయం 5.40 గంటలకు భోపాల్ నుంచి బయలుదేరింది. కల్హార్ స్టేషన్ దాటుతుండగా.. సీ-14 కోచ్ బ్యాటరీ బాక్స్ నుంచి పొగలు రావడాన్ని స్టేషన్ మేనేజర్ గమనించి, అధికారులను అప్రమత్తం చేశారు. రైలును కుర్వాయి–-కైతోరా స్టేషన్‌‌‌‌లో నిలిపివేశారు. కోచ్‌‌‌‌లోని 37 మంది ప్యాసింజర్లను దించేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏ హానీ జరగలేదని రైల్వే ఆఫీసర్లు వెల్లడించారు.

ALSO READ:బీఆర్ఎస్​ పిలుపుకోసం వెయిట్ చేద్దాం.. పొత్తులపై సీపీఎం, సీపీఐ నిర్ణయం