హైదరాబాద్ నడిబొడ్డు‎ అఫ్జల్ గంజ్‎లో కాల్పుల కలకలం

హైదరాబాద్ నడిబొడ్డు అఫ్జల్ గంజ్‎లో కాల్పులు  కలకలం రేపాయి. బీదర్ పోలీసులపై ఏటీఎం దొంగల ముఠా కాల్పులు జరిపింది.  పోలీసులపై మూడు రౌండ్లు ఫైరింగ్ చేసిన దుండగులు అఫ్జల్ గంజ్‎లోని ఓ ట్రావెల్స్ ఆఫీసులోకి పారిపోయారు. సమాచారం అందుకున్న లోకల్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

గురువారం (జనవరి 15) ఉదయం కర్ణాటకలోని బీదర్‌లో ఓ ఏటీఎం క్యాష్ వ్యాన్‌పై దొంగల ముఠా కాల్పులు జరిపారు. ఈ కాలుల్లో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. డబ్బులతో పరారైన దొంగల ముఠా హైదరాబాద్‎కు వచ్చారు. సమాచారం అందుకున్న బీదర్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్‎కు వచ్చారు. అఫ్జల్ గంజ్‏లో తలదాచుకున్న దొంగలు బీదర్ పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపారు.

ALSO READ | లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి. 

ఈ కాల్పుల్లో ఓ బస్ క్లీనర్ గాయపడ్డట్లు సమాచారం. పోలీసుల నుండి తప్పించుకునేందుకు మూడు రౌండ్ల కాల్పులు జరిపిన దొంగల ముఠా.. పక్కనే ఉన్నా  ఓ ట్రావెల్స్ ఆఫీసులోకి పారిపోయారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన సిటీ పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.