పెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం

పెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం

పెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. రెండు కుటుంబాల మధ్య భూతగాదాలు కాల్పులకు దారితీశాయి. ప్రత్యర్థి కుటుంబంపై కక్షగట్టిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషనపల్లి గ్రామంలో 2024, ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం ఈ ఘటన జరిగింది. 

ముస్కు మల్లారెడ్డి, ముస్కు రామయ్య కుటుంబాల మధ్య భూమి పంపకాల్లో వివాదం ఉంది. ఈ విషయంలో 2017లోనే.. ముస్కు మల్లా రెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో మల్లారెడ్డిపై కక్ష పెంచుకున్న రామయ్య.. అతన్ని చంపేందుకు తుపాకీ, ఆరు తూటాలు కొనుగోలు చేశాడు. పొలం దగ్గర పని చేస్తోన్న మల్లారెడ్డిపై.. రామయ్య కాల్పులు జరిపాడు. అయితే రామయ్య కాల్చిన బుల్లెట్లు గురి తప్పాయి. వెంటనే తేరుకున్న మల్లారెడ్డి.. తన భార్యను, కొడుకును పిలవడంతో రామయ్య అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రామయ్య దగ్గర నుంచి తుపాకీ, తూటాలు స్వాధీనం చేసుకున్నారు.