ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పులు, మహిళకు గాయాలు

ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పులు, మహిళకు గాయాలు

ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటన అడ్వకేట్స్ బ్లాక్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక మహిళకు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన మహిళ న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని డీసీపీ సౌత్ చందన్ చౌదరి ధ-ృవీకరించారు.

ఆగంతకుడు లాయర్ల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన మహిళ భర్తే కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు అంచనా వేస్తు్న్నారు. కుటుంబ తగాదాలేవైనా కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ మహిళనే టార్గెట్ చేసి దుండగుడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/AdityaRajKaul/status/1649283045667799043