పదిమంది నకిలీ డాక్టర్లపై ఎఫ్ఐఆర్

పదిమంది నకిలీ డాక్టర్లపై ఎఫ్ఐఆర్

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో పదిమంది నకిలీ డాక్టర్లపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎథికల్ కమిటీ చైర్మన్ తోట కిరణ్ కుమార్, కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నరేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నకిలీ డాక్టర్లు తాము ఆర్ఎంపీలుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని సమాచారం అందడంతో ఇటీవలే ఆకస్మిక దాడులు చేసి పదిమందిపై చర్యలు చేపట్టామని, వారిపై నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్​లో ఎఫ్ఐఆర్​లు నమోదైనట్లు చెప్పారు. నకిలీ డాక్టర్లపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేవలం మెడికల్ కౌన్సిల్​లో రిజిస్టర్ అయిన క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే బోర్డులు పెట్టుకోవాలన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్ల వద్దనే వైద్య చికిత్సలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.