
దేశంలోకి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ‘వివో’ సంస్థ ‘ఐక్యూ’ అనే కో బ్రాండ్‌లో స్మార్ట్‌ఫోన్స్‌ను రిలీజ్ చేయబోతుంది. దీనిలో మొదటగా ‘ఐక్యూ 3’ అనే స్మార్ట్‌ఫోన్ ఈ నెల 25న విడుదలవుతుంది. ఇది దేశంలో రిలీజ్ కానున్న తొలి 5జీ స్మార్ట్‌ఫోన్. అలాగే స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో రాబోతున్న ఫస్ట్ ఫోన్ కూడా ఇదే. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్క్రీన్, 12జీబీ/256జీబీ, ఆండ్రాయిడ్ 10, క్వాడ్ కెమెరా (64 ఎంపీ ప్రైమరీ+13 ఎంపీ అల్ట్రా వైడ్ + 13 ఎంపీ టెలిఫొటో + 2 ఎంపీ డెప్త్ సెన్సర్), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,370 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 25న మధ్యాహ్నం ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు అందుబాటులో ఉంటుంది.