అయోధ్యలో బాల రామయ్య వార్షికోత్సవ సంబరాలు.....వీవీఐపీ, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

అయోధ్యలో బాల రామయ్య వార్షికోత్సవ సంబరాలు.....వీవీఐపీ, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

అయోధ్యలో బాలరామయ్య మొదటి వార్షికోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అయోధ్య రామమందిరంలో జనవరి 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వార్షికోత్సవ సంబరాలు జరుగనున్నాయి.  ఈ సందర్భంగా 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వీవీఐపీ, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. 

ఈ మూడు రోజులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీఐపీ దర్శనాలు ఉండవని, పాసులు కూడా జారీ చేయబోమని పేర్కొన్నారు.  అయితే ఉదయం.. సాయంత్రం దర్శనం స్లాట్లు ఉంటాయని ట్రస్ట్ అధికారులు తెలిపారు.  ఆలయ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ గర్భగుడి వద్ద శ్రీరామ్‌ రాగ్‌ సేవ'కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దేశ వ్యాప్తంగా ఉన్న సాధువులు, భక్తులకు ఆహ్వానాలు పంపామని వెల్లడించారు.