తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు

తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు

దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సును కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో నవంబర్ 5 నుంచి 6 వరకు రెండు రోజులపాటు నిర్వహించింది. 

సదస్సు థీమ్​: ఆసియాను బలోపేతం చేయడంలో బౌద్ధ ధర్మం పాత్ర

లక్ష్యం: ఆసియాలోని బౌద్ధ మతానికి చెందిన నాయకులు, పండితులు ఈ సదస్సులో పాల్గొని బౌద్ధ సమాజంలోని ఆధునిక సమస్యలను, సవాళ్లను పరిష్కరించడం. 

ముఖ్యాంశాలు 

  • భారతదేశం, ఆసియా ఖండంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో బౌద్ధమతం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. బుద్ధుడు, అతని శిష్యులు, బోధనలు, దైవత్వం, సామాజిక విలువలతో ఆసియా ఖండాన్ని ఐక్యంగా ఉంచాయి. 
  • భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైన బౌద్ధమతం స్థిరమైన విదేశాంగ విధానాన్ని, సమర్థవంతమైన దౌత్య సంబంధాలను బలోపేతం చేయగలుగుతుంది. 
  • స్వతంత్ర భారతదేశం జాతీయ గుర్తింపులో భాగంగా బౌద్ధ చిహ్నాలను చేర్చడం నుంచి భారత విదేశాంగ విధానంలో బౌద్ధ విలువలను స్వీకరించడం వరకు బౌద్ధ ధర్మం కీలకపాత్రను పోషించింది. 
  • ఈ సదస్సు భారతదేశ యాక్ట్​ ఈస్టా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. భాగస్వామ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువల ద్వారా ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడమే ఈ విధానం లక్ష్యం. 
  • ఆసియా ఖండం అంతటా, ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తూ  బౌద్ధమతం ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. 

సదస్సులో దృష్టి సారించిన అంశాలు

బౌద్ధ కళ, వాస్తుశిల్పం, వారసత్వం
బౌద్ధకారక, బౌద్ధ ధర్మ వ్యాప్తి
పవిత్ర బౌద్ధ అవశేషాల పాత్ర, సమాజంలో దాని ఔచిత్యం
శాస్త్రీయ పరిశోధన, శ్రేయస్సులో భౌద్ధ ధర్మం ప్రాముఖ్యత
21వ శతాబ్దంలో బౌద్ధ సాహిత్యం, తత్వశాస్త్రం పాత్ర ఏమిటి తదితర అంశాలపై సదస్సులో చర్చించారు.