అమర్​నాథ్ యాత్రకు.. ఫస్ట్ బ్యాచ్‌లో 4వేల మంది టూరిస్టులు

అమర్​నాథ్ యాత్రకు..  ఫస్ట్ బ్యాచ్‌లో 4వేల మంది టూరిస్టులు

శ్రీనగర్:  అమర్ నాథ్  ఫస్ట్  బ్యాచ్  యాత్రికులు శుక్రవారం కాశ్మీర్  లోయకు చేరుకున్నారు. శ్రీనగర్ కు చేరుకున్న 4,603 మంది యాత్రికులకు పోలీసులు, అధికారులు, స్థానిక పౌరులు, వ్యాపారులు స్వాగతం పలికారు. అనంత్ నాగ్  జిల్లాలోని 48 కిలోమీటర్ల నన్వాన్ – పహల్ గామ్  మార్గంలో, అలాగే గందేర్బాల్  జిల్లాలోని 14 కిలోమీటర్ల బాల్టాల్  మార్గంలో శనివారం ఉదయం యాత్ర ప్రారంభం కానుంది. 

శుక్రవారం జమ్మూలోని భగవతి నగర్​లో యాత్రి నివాస్  బేస్ క్యాంప్  వద్ద జమ్మూకాశ్మీర్  లెఫ్టినెంట్  గవర్నర్(ఎల్జీ) మనోజ్  సిన్హా జెండా ఊపి అమర్​నాథ్  యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు ‘భం భం భోలే, హర్  హర్  మహాదేవ్’ అంటూ నినాదాలు చేశారు. ఎల్జీ సిన్హా మాట్లాడుతూ ప్రతిఒక్కరినీ శాంతి, సుఖసంతోషాలతో అమర్ నాథ్  దీవించాలని ఆకాంక్షించారు. యాత్రికుల జర్నీ సేఫ్​గా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.