ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ కల్తీపై నిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహరంలో తొలి కేసు నమోదు అయ్యింది. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతికి సరఫరా చేసిన నెయ్యిలో ఏఆర్ డెయిరీ నిబంధనలు పాటించలేదని టీటీడీ అధికారి ఒకరు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ALSO READ | నిజం ఏంటీ అంటే : తిరుమల లడ్డూ వివాదం.. ఇప్పుడు పాకిస్తాన్ వరకూ వెళ్లింది.. !
టీటీడీ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఏఆర్ డెయిరీ సంస్థపై కేసు ఫైల్ చేశారు. కాగా, తమిళనాడు కేంద్రంగా వ్యాపారం చేసే ఏఆర్ డెయిరీ పాల ఉత్పత్తుల సంస్థ తిరుమలకు నెయ్యి సరఫరా చేసే టెండర్ దక్కించుకుంది. అయితే, తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీలో జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు టీటీడీ అధికారి ఏఆర్ డెయిరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు లడ్డూ కల్తీపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు డీఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.