
ఉదయం లేచి వేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేముందు ఆఫ్ చేసే స్విచ్ వరకు అన్నీ ప్లాస్టికే. పెన్ను..రీఫిల్.. కంప్యూటర్..మొబైల్ ఫోన్.. ఫ్రిజ్.. టీవీ.. టేబుల్ ఇలా ప్రపంచమంతా ప్లాస్టిక్‌మయం. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ రంగం కొలువుల ఖజానాగా మారింది. కేవలం టెన్త్ పాసైతే చాలు ప్లాస్టిక్ రంగంలో కోర్సులు నేర్పించేందుకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) పదోతరగతితోనే డిప్లొమా కోర్సులు అందిస్తుంది.. ఇందులో అడ్మిషన్ దొరికితే చాలు.. మంచి ప్యాకేజీతో ఉద్యోగం దొరికినట్లే.
మొత్తం సీట్లు: 300
దరఖాస్తులు: ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
చివరితేది: 30 నవంబర్
రిజల్ట్స్: 1 డిసెంబర్ 2021
అడ్రస్: ఐడీఏ ఫేజ్2, చర్లపల్లి, హైదరాబాద్ 500051.
ఉద్యోగావకాశాలు
సీపెట్ లోని ప్లాస్టిక్ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ తయారీ సంస్థలే కాకుండా ఫార్మా రంగంలోనూ వీరికి అవకాశాలున్నాయి. ల్యాబ్‌లు, రీసెర్చ్ సెంటర్లు, పెట్రో ఆధారిత పరిశ్రమలు సైతం వీరిని తీసుకుంటున్నాయి. సొంతంగా కూడా ప్లాస్టిక్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. వారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇస్తూ ప్రోత్సాహం కల్పిస్తున్నాయి.
ఫుల్ డిమాండ్
సీపెట్ లోని ప్లాస్టిక్ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో బోలెడన్ని అవకాశాలున్నాయి. ప్లాస్టిక్ తయారీ సంస్థల్లోనే కాకుండా ఫార్మా, ఇరిగేషన్, మెడికల్, ప్యాకేజింగ్, ఫుడ్ ఇండస్ట్రీ ఇలా ప్లాస్టిక్ వినియోగించే ప్రతి పరిశ్రమలో ప్లాస్టిక్ కోర్సులు చేసినవారి అవసరం ఉంది. బీఎస్సీ అర్హతతో ప్లాస్టిక్ ప్రాసెసింగ్, టెస్టింగ్‌లో పీజీ డిప్లొమా చేసినవారిని సూపర్‌వైజర్లుగా తీసుకుంటున్నాయి. సీఏడీ, సీఏఎంలో పీజీ చేసినవారికి మౌల్డ్ డిజైనర్లుగా వేలల్లో జీతం దొరుకుతోంది. కేవలం టెన్త్‌తోనే డిప్లొమా చేసినవారికి అసిస్టెంట్ ఇన్‌ఛార్జి, షిఫ్ట్ ఇన్‌ఛార్జిగా అవకాశాలు లభిస్తున్నాయి. డిమాండ్ ఉన్న ఈ రంగంలో కష్టపడితే మంచి జీతంతో స్థిరపడడమే కాకుండా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయవచ్చు.
కోర్సులు డ్యురేషన్ అర్హత
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ( ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్) 2 సంవత్సరాలు డిగ్రీ ఇన్ సైన్స్
పోస్ట్ డిప్లొమా ( ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ సీఏడీ/సీఏఎం) 18 నెలలు డిప్లొమా
డిప్లొమా ఇన్ మౌల్డ్ టెక్నాలజీ 3 సంవత్సరాలు పదోతరగతి
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ 3 సంవత్సరాలు పదోతరగతి
క్యాంపస్‌లోనే ప్లేస్‌మెంట్
హైదరాబాద్ సీపెట్ క్యాంపస్‌లో డిప్లొమా, పీజీ పూర్తిచేసినవారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కచ్చితంగా జాబ్ దొరుకుతోంది. ఇప్పటికే ఇక్కడ కోర్సులు పూర్తి చేసినవారిలో 80శాతం మంది తమకు నచ్చిన ఉద్యోగాల్లో చేరారు. మిగతా వారు హయ్యర్ స్టడీస్‌కు వెళ్తున్నారు. ఇండియాలోని టాప్ కంపెనీలు క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. మిల్టన్, నీల్‌కమల్, బజాజ్, సుప్రీం, టైమ్స్ ప్యాకేజింగ్, సఫారీ, వీఐపీ, సుధాకర్ పీవీసీ కంపెనీలు సీపెట్ విద్యార్థుల్ని హైర్ చేసుకుంటున్నాయి. పూర్తి వివరాలకు 8374064444, 9445035650 నంబర్లకు సంప్రదించవచ్చు.
- జి.జయలక్ష్మి, ట్రైనింగ్ ఇన్‌చార్జ్