మెడికల్ కౌన్సిల్‌‌కు తొలి ఎలక్షన్స్‌‌.. 13 మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు టఫ్ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డాక్టర్ల రిజిస్ట్రేషన్, రెన్యువల్​కు ఇంకో రెండ్రోజులే గడువు
ఆపై నోటిఫికేషన్ విడుదల, ఆన్​లైన్ ఓటింగ్​కూ చాన్స్!
ప్రచారం ప్రారంభించిన డాక్టర్స్ అసోసియేషన్లు

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణలో స్టేట్ మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలిసారి జరగనున్న ఎన్నికల్లో పోటీ పడేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు. జనరల్ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలపించేలా ప్రతి జిల్లాకు వెళ్లి డాక్టర్లతో సమావేశాలు నిర్వహించి, తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికలు రసవత్తరంగా జరగనుండడంతో కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెన్యువల్ చేసుకునేందుకు డాక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెల చివరలో లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్నికలు నిర్వహించేందుకు కౌన్సిల్ సిద్ధమవుతోంది. మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే 56 వేల మంది డాక్టర్లు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్లకు, రెన్యువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉంది. ఆపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో పోస్టల్ లేదా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ అవకాశం ఇచ్చే అంశాన్ని కౌన్సిల్ పరిశీలిస్తోంది.

13 పోస్టులకు ఎన్నికలు

మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్​లో 25 మంది సభ్యులు(డాక్టర్లు) ఉంటారు. ఇందులో 13 మందిని.. రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. మిగిలిన 12 మందిని ప్రభుత్వం నేరుగా నామినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. మొత్తం 25 మంది సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఒకరిని కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నుకుంటారు. 13 మెంబర్ పోస్టులకు ప్యానల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏర్పడి పోటీ చేసేందుకు డాక్టర్స్ అసోసియేషన్లు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వ డాక్టర్లు ఇప్పటికే నాలుగైదు గ్రూపులుగా చీలిపోయారు. ఎవరికి వాళ్లే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో, డాక్టర్ల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా, కోర్టుకు వెళ్లి మరీ ఎన్నికలు జరిగేలా కృషి చేసిన హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీకి ముందు వరసలో ఉన్నాయి. ఈ రెండు అసోసియేషన్లు ప్రతి జిల్లాలోనూ కమిటీలను నియమించుకున్నాయి. 

ALSO READ:ఔటర్​పై లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

జనరల్ ఎలక్షన్స్ తరహాలో..

మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు ఐదేండ్లకోసారి నిర్వహించాలి. చివరిగా 2007లో కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ వచ్చాక ఎన్నికలు నిర్వహించాలని డాక్టర్లు ఎన్నిసార్లు కోరినా సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒప్పుకోలేదు. పైగా డాక్టర్లు తమ ఓటు ద్వారా ఎన్నుకోవాల్సిన పోస్టుల్లో కూడా నామినేటెడ్ మెంబర్లను నియమించింది. దీంతో హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టును ఆశ్రయించింది. నామినేటెడ్ మెంబర్లను తొలగించాలని, ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ రాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టుకెక్కింది. అక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏంటి లాభం?

మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధికార పరిధి ఉంటుంది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీల క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై రైడ్ చేయడం, వారిపై కేసులు పెట్టించే అధికారం ఉంటుంది. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎథికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ల రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు, అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వాలిఫైడ్ డాక్టర్లను నియమించుకునే హాస్పిటళ్లను మూయించే అధికారం కూడా కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్లకు ఉంటుంది. రాష్ట్రంలో కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటళ్లు, పెద్ద హాస్పిటళ్లకు మద్దతుగా ఉంటున్న ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీలు, చిన్న హాస్పిటళ్లు, నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నడిపిస్తున్న డాక్టర్లపై తప్పుడు ప్రచారం చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికి అనేకసార్లు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వం, ఈ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో గెలిచి, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీలకు చెక్ పెట్టాలని డాక్టర్లు భావిస్తున్నారు.