- దేశంలోనే మొట్టమొదటిసారి
- గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలనే సంకల్పంతో నిర్ణయం
కోల్బెల్ట్, వెలుగు: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్లోని విజయగణపతి దేవాలయంలో మంగళవారం గోమాత మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలనే సంకల్పంతో గోమాత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పలువురు మాలలు ధరించి గోవుల పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవు లేనిదే మానవ మనుగడ లేదని.. గోమాతలో సకల దేవతలు కొలువై ఉన్నారని అన్నారు. గోవును రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరుపై ఉందన్నారు.
గోమాత మాలధారణ దేశంలోనే తొలిసారిగా ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. 11,21,41 రోజుల కాలపరిమితితో మాల ధారణ ఉంటుందన్నారు. అంతకు ముందు గోమాతలతో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో చిలుకూరి బాలాజీ దేవాలయం అర్చకులు ఆత్మరాం గురూజీ, కమలేశ్ గురూజీ, యోగేశ్ ప్రభు గురూజీ, శ్రీహరి సర్వేశ్వర అంబిక గురూజీ మహారాజ్,బొడ్డు రాజశేఖర్ గురూజీ, కృష్ణమూర్తి అయ్యప్ప గురు స్వామి, గోమాల సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.