గోలేటి గనిలో ముందుగా తవ్వకాలు.. పర్మిషన్లకు సింగరేణి ముమ్మర ప్రయత్నాలు

గోలేటి గనిలో ముందుగా తవ్వకాలు.. పర్మిషన్లకు సింగరేణి ముమ్మర ప్రయత్నాలు
  • ఈ నెలాఖరులో స్టేజ్-1 పర్మిషన్లు రావొచ్చని ఆఫీసర్ల అంచనా
  • మూసివేసిన గనుల్లో  కొత్తగా ఓసీపీ తవ్వకాలు షురూ
  • 15 ఏండ్లలో  36 మిలియన్​టన్నుల బొగ్గు టార్గెట్ 

కోల్​బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: 2025-– 26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి కొత్తగా నాలుగు బొగ్గు బ్లాక్ లు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సంస్థ ప్రణాళికలో మొత్తంగా10 గనులు ఉండగా.. ఇందులో ముందుగా ఒడిశాలోని నైనీకోల్​బ్లాక్, కొత్తగూడెం వీకే మైన్, ఇల్లందులోని రొంపేడు ఓసీపీ, బెల్లంపల్లిలోని గోలేటి ఓసీపీని చేపట్టనుంది. వీటిలో బెల్లంపల్లి రీజియన్​పరిధిలో మూసివేసిన గనులను కలిపి కొత్తగా గోలేటి ఓపెన్​కాస్ట్​మైన్​ఏర్పాటుకు ముమ్మర చర్యలు తీసుకుంటోంది. దీనికి అవసరమైన ఎన్విరాన్​మెంట్, ఫారెస్ట్​స్టేజ్-–1 పర్మిషన్లు ఫైల్ స్టేజ్ ఉండగా.. ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. 

మూసి వేసిన గనుల్లో బొగ్గు గుర్తించగా..  

బెల్లంపల్లి ఏరియాలో మూసి వేసిన గోలేటి–-1, గోలేటి–-1ఏ అండర్​గ్రౌండ్ మైన్లతో పాటు బెల్లంపల్లి ఓసీపీ-–2 ఎక్స్​టెన్షన్​బ్లాక్, అబ్బాపూర్​ఓసీపీలను కలుపుకొని గోలేటి ఓపెన్​కాస్ట్ ఏర్పాటుకు ఇప్పటికే సింగరేణి నిర్ణయం తీసుకుంది. గనిలో 36 మిలియన్​టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించగా.. వచ్చే15 ఏండ్ల పాటు  బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేసింది. జీ-–10,11,13 గ్రేడ్ల బొగ్గును ఏడాదికి 3.5 మిలియన్ టన్నుల చొప్పున వెలికితీయనుంది. అందుకు ముందుగా గనిలో 560.56 మిలియన్​క్యూబిక్​మీటర్ల మట్టిని తీయాల్సి ఉంటుంది. 

ఫారెస్ట్, ఎన్విరాన్​మెంట్ పర్మిషన్లలో లేట్  

గోలేటి ఓపెన్​కాస్ట్​ గనికి 1,358.280 హెక్టార్లలో భూమి కావాలి. ఇవి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల సరిహద్దులో( సోనాపూర్​ సమీపంలోని పావురాలగుట్ట, భీమన్న గుడి సమీపంలోని గుండాల వాగు, ఖైరిగూడ వాగు సరిహద్దులను కలుపుకొని) ఉన్నాయి. ఇప్పటికే  సింగరేణి పరిధిలో 594.071 హెక్టార్ల భూమి ఉంది. మిగిలిన 665.914 హెక్టార్లను సేకరించాలి. ఇందులో 50 ఎకరాలు ప్రైవేటు, మిగతాది ఫారెస్ట్​ల్యాండ్ ఉంది. రూ.345.87 కోట్లతో కొత్త ఓసీపీని చేపట్టేందుకు 2022, అక్టోబర్​లో ప్రజాభిప్రాయసేకరణ కూడా పూర్తి చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి స్టేజ్​–-1 పర్మిషన్లకు కూడా దరఖాస్తు చేసుకుంది. 

ప్రస్తుతం పర్మిషన్ల లాస్ట్ స్టేజ్ లో ఉండగా ఈ నెలఖారులోపు రావొచ్చని, మరోవైపు రాష్ట్రస్థాయి స్టేజ్​-–2 పర్మిషన్లను కూడా ఆగస్టులోపు సాధిస్తామనే ధీమాను సింగరేణి అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయిన తర్వాత మూడేండ్లలోపు ప్రాజెక్టును చేపట్టాలి. గడువు దాటితే మరోసారి పబ్లిక్​హియరిం గ్​చేపట్టాలి. అన్ని పర్మిషన్లను అక్టోబర్ లోపు పొంది గనిలో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ముందస్తుగానే సింగరేణి చర్యలు తీసుకుంటోంది. ఇదే ఏడాదిలో  గోలేటి ఓసీపీతో పాటు నైనీ కోల్​బ్లాక్, వీకే మైన్, రొంపేడు ఓసీపీలను ప్రారంభిస్తామని ఇటీవలే సింగరేణి సీఎండీ బలరాంనాయక్​ తెలిపారు.

బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం 

ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలో ఖైరిగూడ ఓసీపీ ఒక్కటే ఉంది. గతంలో మార్గన్స్​పిట్, సౌత్​క్రాస్​కట్, ఇంక్లైన్​-1,2,68 డీప్​అండర్​గ్రౌండ్​గనులు, తాండూరు మండలం బోయపల్లి, మాధారం1,2,3,4,5,6 యూజీ మైన్లు, రెబ్బెన మండలం గోలేటి–1, 2 యూజీ మైన్లు, గోలేటి ఓసీపీ–1,2, తిర్యాణి మండలం ఖైరిగూడ, డోర్లి–1,2 ఓసీపీలుండేవి. అవన్నీ ఇప్పటికే మూసి వేయడంతో ఖైరిగూడ ఓసీపీ ఒక్కటే బెల్లంపల్లి ఏరియాలో ఉంది. 

గోలేటి ఓసీపీతో బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవంతో అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి. కార్మికుల సంఖ్య పెరగనుండడంతో వీరిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మందికి, నిరుద్యోగ యువత పరోక్షంగాఉపాధి పొందే చాన్స్ ఉంది. దీంతో పాటు భవిష్యత్​ లో ఎంవీకే ఓసీపీతో పాటు మరో ఓసీపీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సింగరేణి ప్లాన్ సిద్ధం చేసింది.