హైదరాబాద్, వెలుగు: లగ్జరీ ఫినిషెస్ మేకర్ టెక్నో హైదరాబాద్లోతొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని హైటెక్‌సిటీ ఐసీసీకి సమీపంలో ఏర్పాటు చేసింది. అనుబంధ కంపెనీ రిచ్‌వేవ్స్ తయారు చేస్తున్న ఇటాలియన్, లగ్జరీ ఫినిషెస్‌ను ఇక్కడ ప్రదర్శించారు.
రిచ్‌వేవ్స్ బ్రాండ్ కింద 200లకుపైగా వెరైటీలను ఆఫర్ చేస్తున్నట్టు టెక్నో సీఎండీ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భారీ ఎత్తున ఇటాలియన్, లగ్జరీ ఫినిషెస్ తయారు చేస్తున్న భారతీయ కంపెనీ తమదేనని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వీటి తయారీకి కూకట్‌పల్లిలో ప్రత్యేకంగా ప్లాంటు ఏర్పాటు చేశామన్నారు. మార్బుల్ ఫ్లోర్స్, వుడ్ ప్యానలింగ్, మెటాలిక్ వాల్‌పేపర్, ఫర్నిచర్‌ను ఫినిషెస్ అంటారు.