- హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952, ఫిబ్రవరిలో ముగిశాయి.
- 1952 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు 25 మంది సభ్యులు ఎన్నికయ్యారు.
- 1952 ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ శాసనసభకు 175 మంది సభ్యులు ఎన్నికయ్యారు.
- అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో గోసాయి – దేశాయి వర్గాలుగా పేరుపడ్డ కాంగ్రెస్ వర్గాలు రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు వర్గాలు.
- 1952 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ 93 స్థానాలు గెలుచుకుంది.
- 1952 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేశారు.
- 1952 సార్వత్రిక ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 42 స్థానాలు గెలుచుకున్నారు.
- 1952 సార్వత్రిక ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది.
- 1952 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ శాసనసభకు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 46 స్థానాలు గెలుచుకుంది.
- 1952 ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులు తెలంగాణలో 35 శాసనస సభ స్థానాలు గెలుచుకుంది.
- 1952 ఎన్నికల్లో ఓటమి పాలైన నిష్కల్మశప్రజా నాయకులు జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు.
- హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు తర్వాత ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు.
- బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి 1952 మార్చి 6 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
- బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ సీఎం త్రివేది.
- హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కాశీనాథరావు వైద్య.
- హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పంపన్గౌడ్.
- హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వి.డి.దేశ్‌పాండే.
- బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో హోంశాఖ మంత్రి దిగంబరరావు బిందు.
- బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో కె.వి.రంగారెడ్డి ఎక్సైజ్, అటవీ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.
- బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి వినాయకరావు విద్యాలంకార్.
- బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మర్రి చెన్నారెడ్డి వ్యవసాయం, పౌర సరఫరాలు, ప్రణాళికా, అభివృద్ధి మంత్రిత్వశాఖలు నిర్వహించారు.
- బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి గోపాలరావు ఎక్బొటే.
- బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రి దేవీసింగ్ చౌహన్.
- బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్‌ప్రముఖ్‌గా వ్యవహరించారు.
- బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న ఐసీఎస్ అధికారి ఎం.కె.వెల్లోడి.
- హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదార్ల చట్టం 1950 జనవరి నుంచి అమల్లో ఉంది.
- భారతదేశంలో భూకమతాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పేరుపొందారు.
- బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజాం కరెన్సీ, నాణేలు రద్దయి, వాటి స్థానంలో భారత ప్రామాణిక కరెన్సీ అమల్లోకి తీసుకువచ్చారు.
- మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం హైదరాబాద్.
- మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు.
- ప్రతి 500 జనాభా గల గ్రామానికి పాఠశాలను ఏర్పాటు చేసింది బూర్గుల రామకృష్ణారావు.
- బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలో మొదటి తరగతి నుంచి మాతృభాషలో విద్యా బోధన ప్రవేశపెట్టారు.
- బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలో ఐదో తరగతి నుంచి ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టారు.
- వరంగల్ జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు.
- హైదరాబాద్ రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖను 1955 జులై 1న ఏర్పాటు చేశారు.
- నాగార్జున సాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శంకుస్థాపన చేసింది 1955 డిసెంబర్ 10న.
- తెలంగాణలో భూదానోద్యమం 1951 ఏప్రిల్ 18న నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి నుంచి ప్రారంభమైంది.