మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్.. ఏపీలో తొలి కేసు నమోదు

మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్.. ఏపీలో తొలి కేసు నమోదు

  తెలుగు రాష్ట్రాల్లో  బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు కోళ్లకు వచ్చిన బర్డ్ ఫ్లూ ఇపుడు మనుషుల్లో కూడా వస్తుంది. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో  ఫస్ట్ బర్డ్ ఫ్లూ కేసు నమోదయ్యింది. ఏలూరులో ఓ మనిషికి టెస్టుల్లో  బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది.  

ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్ కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో  అతడికి టెస్టులు చేయడంతో  ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది.   ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.  మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

 జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఏలూరు జిల్లా వైద్యశాఖ అధికారిని  డాక్టర్ మాలిని  తెలిపారు.  బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం..  బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

మరోవైపు ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్పెక్టెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో 24X7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.

ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా రోజుల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా కోళ్లు చనిపోయాయి.  ఇప్పటికే చికెన్,గుడ్లు తొనద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది.  చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. దీంతో  పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.