చంద్రునిపై ఫస్ట్ టైం ప్రైవేట్ కంపెనీ రీసెర్చ్ ఫొటోస్ ఇవే..

చంద్రునిపై ఫస్ట్ టైం ప్రైవేట్ కంపెనీ రీసెర్చ్ ఫొటోస్ ఇవే..

అమెరికా నుంచి మొదటి సారిగా ఓ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ చంద్రుని మీదకు స్పేస్ క్రాఫ్ట్ పంపించింది. చంద్రునిపై పరిశోధనలకు ప్రైవేట్ కంపెనీ శాటిలైట్ పంపించడం ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైం. ఇది మొదటి US నిర్మిత క్రాఫ్ట్ కూడా.  హూస్టన్ కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ ఒడిస్సియస్ అనే హ్యూమనౌకను 2024  ఫిబ్రవరి 15న భూమి నుంచి లాంచ్ చేసింది. ఈరోజు ఒడిస్సియస్ చంద్రునిపై తీసిన ఫొటోలను పంపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే  రాకెట్ ఒడిస్సియస్ ను చంద్రునిపైకి తీసుకెళ్లింది. నాసా తయారు చేసిన పరికరాలతోనే ఈ ప్రాజెక్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రవేట్ సంస్థల సహకారంతో ఆ ప్రాజెక్ట్  చేశారు. ఫిబ్రవరి 22న మూన దక్షిణ దృవానికి దగ్గర ఒడిస్సియస్ ల్యాండ్ అయ్యింది.  

చంద్రునిపై మానవ ఉనికిని స్థాపించడమే లక్ష్యంగా పరిశోధనల కోసం దీన్ని పంపించారు. 7 నుంచి 10 రోజులు ఈ స్పెస్ క్రాఫ్ట్ చంద్రునిపై తిరిగి సమాచారాన్ని పంపించే విధంగా నాసా ప్రోగ్రామ్ చేసింది. ల్యాండింగ్ లో కొన్ని పొరపాట్లు జరిగి కనెక్షన్ కోల్పోతామని భావించగా ఎట్టకేలకు ఓ సైడ్ ల్యాండ్ అయింది. కొన్ని ఫొటోకు కూడా ఒడిస్సియస్ పంపించింది. 
ఎన్ని తప్పిదాల వల్ల ఒడిస్సియస్ లైఫ్ టైంను తగ్గించాలని సైంటిస్టుల భావిస్తున్నారు. చంద్రునిపై తిరిగే సాటిలైట్ సౌరశక్తితో పనిచేస్తుంది. కాబట్టి ఇది డే టైంలోనే పని చేస్తుంది.  ఇలా జరిగితే సాటిలైట్ పంపించే డేటా ఎంత వరకు తగ్గుతుందని ఆస్ట్రోనట్స్ అంచనా వేస్తున్నారు.